![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1086 లో.. నా తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకుంటానని నాకు మాట ఇవ్వండి అని మను అనగానే.. తప్పకుండా తెలుసుకుంటానని మహేంద్ర మాటిస్తాడు. అదంతా చూస్తూ వసుధార, అనుపమ ఇద్దరు కంగారుపడతారు. ఇన్ని రోజులు మనుకి తన తండ్రి ఎవరో తెలిస్తే ఏమవుతుందోనని భయపడేవాళ్ళం ఇప్పుడు మావయ్యకి మను తన కొడుకే అని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందోనని బయపడుతున్నాం.. మీరు మను గారికి నిజం చెప్పండి అని అనుపమతో వసుధార అంటుంది.
మనుకి మహేంద్ర ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోమని చెప్దామని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఏం ఆలోచిసున్నావ్? ఎందుకు ప్రామిస్ చేసాడు అనుకుంటున్నావా.. ఒక కొడుకుగా అడుగుతున్నా అన్నప్పుడు నేనేం చెయ్యగలను ఖచ్చితంగా మను తండ్రి ఎక్కడున్నా తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు. అలా అంటున్నావ్ ఏంటి నేనే ప్రామిస్ వెనక్కి తీసుకోమని చెప్దామని అనుకున్నానని అనుపమ అనగానే.. ఎట్టి పరిస్థితిలోను ఇచ్చిన మాటని అసలు తప్పనని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార క్యాబిన్ లోకి ఏంజిల్ వస్తుంది. నాకు చిన్న హెల్ప్ కావాలి చేస్తావా అని అడుగగా.. చేస్తానని వసుధార అంటుంది. ఈ కాలేజీలో నాకు జాబ్ కావాలి అని ఏంజిల్ అనగానే.. నీకు జాబ్ ఏంటి మీకే కాలేజీ ఉంది కదా.. అసలు ఎందుకు జాబ్ కావాలి అంటున్నావని వసుధార అడుగుతుంది. మను నేను ఫోన్ చేసిన పట్టించుకోవడం లేదు.. అందుకే అతనిపై రివెంజ్ తీసుకోవడానికి నాకు మనుకి అపోజిట్ అయిన పక్కన అయిన క్యాబిన్ కావాలని ఏంజిల్ అంటుంది. దానికి వసుధార నువ్వుతు సరే నీకు నచ్చిన దగ్గర ఉండు.. నేనే పర్మిషన్ ఇస్తున్నానని అంటుంది.
ఆ తర్వాత మను వస్తుంటే.. శైలేంద్ర పాట పడుతుంటాడు. ఏదో ఒక రకంగా మనుని బాధ పెట్టాలని అనుకుంటాడు. నువ్వు నీకు తెలియకుండానే చాలా విషయాలు తెలిసేలా చేస్తావ్.. నువ్వు కనుక నా తండ్రి గురించి తెలుసుకుంటే నీకు ఏం కావలన్న ఇస్తానని మను అంటాడు. నీ తండ్రి కనిపిస్తే ఏం చేస్తావని శైలేంద్ర అడుగగా.. చంపేస్తానని మను అంటాడు. ఇది మనకు లాభమే వాడి తండ్రిని కనిపెడితే వాన్ని చంపి జైల్లోకి మను వెళ్తే.. ఆ తర్వాత నాకు అడ్డెవరు ఉండరని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు ఏంజిల్ మను క్యాబిన్ లో ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఉన్నావంటు మను అడుగుతాడు. నాకు వసుధార పర్మిషన్ ఇచ్చిందని ఏంజిల్ చెప్తుంది. మను వర్క్ చేస్తుంటే ఏంజిల్ తనకి కన్ను కొడుతుంది. అది చూసి ఏం చేస్తున్నావని మను అడుగుతాడు. అదంతా చూస్తూ వసుధార నవ్వుకుంటంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |